క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు ఇచ్చే విజ్ఞాపన ఉత్తరాలపై తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల (MP/MLC/MLA) సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు.
Read Also : గ్రామస్థాయి రెవెన్యూ అధికారి (వీఎల్వో) పోస్టులకు దరఖాస్తుల వెల్లువ..
దీంతో ఏపీ సీఎం కృతజ్ఞతలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని చంద్రబాబుకు రాసిన లేఖలో రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (SED) (రూ. 300/- టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయని టీటీడీ ప్రకటించింది. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని తెలిపింది.
ఇవి కూడా చదవండి :