
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసింది. నేడు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇవాళ హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్ లో లక్ష మందితో సభ నిర్వహించనుంది. ఈ సభలో భాగంగా మహిళలకు వరాలజల్లు కురిపించేటువంటి అవకాశం ఉంది. మొదటగా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత సాయంత్రం ఐదు గంటలకు ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటినుంచి మహిళలని కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా వారి కోసం చాలా పథకాలు అమలు చేశామని తెలిపారు.
అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులు నడిపితే కఠిన చర్యలు తప్పవు
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి మిషన్ 2025 రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సెర్ప్, మెప్మా లను విలీనం చేసి కోటి మంది మహిళలకు లక్ష రూపాయల కోట్ల రుణం అందించడమే లక్ష్యంగా వెళ్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 600 బస్సులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 31 జిల్లాలలో పెట్రోల్ బంకులను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ బంకులు ఏర్పాటు అయ్యేలా చమురు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇటీవల ఒక పెట్రోల్ బంక్ మహిళల ద్వారా ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇదే సభలో మహిళా సంఘ సభ్యులకు లోన్ బీమా మరియు ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేస్తారు. అంతేకాకుండా మహిళా సంఘాలకు రుణ సదుపాయాన్ని కల్పిస్తూ చెక్కులను జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులకు ఇస్తారు. కాగా ఈ శుభ సాయంత్రం 5:00 నుంచి 6 గంటల మధ్యలో ఎప్పుడైనా ప్రారంభం అయ్యే ఎటువంటి అవకాశం ఉంది. ఇక ఎనిమిది గంటలకు సభ ముగింపు పలకనుందని సమాచారం.