తెలంగాణ

రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు!… అర్ధరాత్రి నుండి అకౌంట్లోకి డబ్బులు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు నగదును నేడు జమ చేస్తామని తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే డబ్బులు ఇవాళ జమ కావని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆదివారం కావడంతో ప్రభుత్వం ప్రకటించినటువంటి డబ్బులు జమ కావని, ఇవాళ అర్ధరాత్రి 12 గంటల తరువాత నుంచే ఎకౌంట్లో డబ్బులు జమవుతాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాలంలో సాగు ఖర్చులు చాలా బాగా పెరిగాయని ఆలోచించాను కాబట్టే రైతు భరోసా నిధులు పెంచామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను ఒకేలా చూస్తుందని , రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పథకాలు అందుతాయని తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

1. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కార్పొరేటర్ సబిహా గౌసొద్దీన్

2.అన్ని రాష్ట్రాలలో బంగారం ఆభరణాల రేట్లు? ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

3.బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కేకే!!

4.విజయసాయిరెడ్డి రాజీనామా లేఖను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button