తెలంగాణ

రేవంత్ మీటింగ్‌కు కిషన్ రెడ్జి, బండి సంజయ్!

తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులు, సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో అన్ని పార్టీల ఎంపీల మీటింగ్ జరగనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారు.

పెండింగ్‌‌లో ఉన్న సమస్యలపై ఎంపీలు పార్లమెంట్‌‌లో, కేంద్ర ప్రభుత్వం వద్ద మాట్లాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌‌లతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలందరిని డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు.దీంతో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. కొన్ని రోజులుగా కేంద్రనిధులపై కాంగ్రెస్ , బీజేపీ మధ్య వార్ సాగుతోంది.

తెలంగాణపై మోడీ సర్కార్ వివక్ష చూపిస్తుందని… ఏ ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తెలంగాణ నుంచి రూపాయి పోతే కేంద్రం నుంచి 40 పైసలు మాత్రమే వస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదాని పట్టిస్తుందని బీజేపీ కౌంటరిస్తోంది. కేంద్రం నిధులు లేకుంటే రేవంత్ సర్కార్ అడుక్కోవాల్సిందేనని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజా భవన్ సమావేశానికి బీజేపీ ఎంపీలు వస్తారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button