
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు నాణ్యమైన చీరలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకును ప్రారంభించిన సీఎం అనంతరం ఈ విషయాలను తెలిపారు.
మొదటగా ప్రతి జిల్లాలోనూ ఒక చోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆ తరువాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చెప్పున ఉండేలా చర్యలు తీసుకుబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి