
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం తెలంగాణ రాష్ట్ర ప్రజాసేవలో నిమగ్నమవుతూ, రాష్ట్ర అభివృద్ధికి సహాయపడాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించినట్లుగా సీఎంఓ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో ఎప్పుడూ కూడా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా సెగ గాలులు తగులుతున్న సమయంలో రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో వైరాలు కొంచెం తగ్గాయి. అంతేకాకుండా మరోవైపు కెసిఆర్ ఆరోగ్యంగా అలాగే సుఖ,సంతోషాలతో చిరకాలం జీవించాలని కోరుకుంటున్నట్లుగా మంత్రి పొన్నం ట్విట్ చేశారు.
స్వార్థం లేని నాయకుడు రోహిత్ శర్మ : రవిచంద్రన్ అశ్విన్
మరోవైపు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పార్టీ అధినేత కెసిఆర్ బర్త్డే సందర్భంగా రాష్ట్రంలోని పట్టణాలతో పాటుగా పల్లెల్లో కూడా ఘనంగా వేడుకలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. కెసిఆర్ మళ్లీ రాజకీయంలో ముందడుగు వేసి పల్లె, పల్లెలో తిరగాలని ప్రజల ఆకాంక్షిస్తున్నట్లుగా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. కాగా కేసీఆర్ చాలా రోజులుగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోషల్ మీడియా వేదిక బర్త్ డే సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నాయకులే కాకుండా ఇతర రాష్ట్రాల్లో నాయకులు కూడా బర్త్డే విషెస్ తెలుపుతున్నారు.