
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను అవమానించడంతో రెండు తెలుగు రాష్ట్రాల హిందువులు పెద్ద ఎత్తున అతనిపై ఆగ్రహంగా ఉన్నారు. పెండ్లి కానోళ్లకు హనుమంతుడు అంటూ.. తాగేటోళ్లకు ఎల్లమ్మ అంటూ పలు రకాలుగా హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడారు. రేవంత్ రెడ్డి హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడాడని నిరసిస్తూ ఇప్పటికే బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఎంతోమంది జాతీయ రహదారులపై నిరసనలు కూడా చేశారు. ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హిందూ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణలోని భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితులు ఏర్పడ్డాయని కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఎంతోమంది పారిశ్రామికవేత్తలకు అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీని కొత్తగా తీసుకువచ్చారు అని ఆరోపించారు. ఇక మరోవైపు మెజార్టీ ప్రజలైన హిందూ ప్రజల ఆరాధ్య దేవతలైనటువంటి దేవి దేవతలను అవమానించడం ఇంకో మతపు ప్రజల మన్నలను పొందటమే అని.. ఇది రాజకీయంగా వాడుకోవడానికి చేస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి పై యావత్ హిందువులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి బేసరత్తుగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు.
Read also : భారీ స్కోరు నమోదు చేసిన టీమిండియా.. ఇద్దరు ప్లేయర్లు సెంచరీలు!
Read also : A Huge Encounter: ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి





