
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మహిళలు అత్యున్నత స్థాయికి ఎదిగే వరకు నిరంతరం మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, మహిళల భద్రత, మహిళల గౌరవం కోసం కృషి చేస్తున్నామని చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక తాజాగా ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమం కోసం ఏకంగా 4332 కోట్లు కేటాయించామని చంద్రబాబు నాయుడు మరోసారి గుర్తు చేశారు.
ఇక రాష్ట్రంలో దీపం-2 పథకం కింద 90 లక్షల మందికి ఉచిత సిలిండర్లు అలాగే పెన్షన్లు అలాగే అంగన్వాడీ సెంటర్లో బలోపేతం లాంటి చర్యలతో మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రతను మరింత బలోపితం చేస్తామని తెలిపారు. మహిళల భద్రతమే ప్రభుత్వ మొదటి బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు అన్నగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. మహిళల అభివృద్దె రాష్ట్రానికి సాకరం అని తెలియజేసారు.