
Trump Warns Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ ఎలన్ మస్క్ మధ్య వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా మస్క్ పై ట్రంప్ సీరియస్ కామెంట్స్ చేవారు. అమెరికా చరిత్రలోనే ఎవరూ తీసుకోనంత రాయితీలను మస్క్ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఒకవేళ అవి లేకపోతే దుకాణం మూసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా పోస్టు పెట్టారు. “కొద్ది నెలల క్రితం వరకు నాకు అతడు బలమైన సపోర్టు అందించాడు. అప్పటికే నేను ఎలక్ట్రిక్ వాహనాలను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించాను. ఆ విషయం మస్క్ కు బాగా తెలుసు. ఎలక్ట్రిక్ కార్లు మంచివే. కానీ, ప్రతి ఒక్కరు వాటినే కొనాలని బలవంతం చేయలేం. ఇప్పటి వరకు మానవ చరిత్రలో ఎవరూ తీసుకోలేనంద సబ్సిబీ మస్క్ తీసుకుంటున్నాడు. ఆ రాయితీలు లేకపోతే ఆయన దుకాణం సర్దుకొని సౌతాఫ్రికాలోని ఇంటికి పోవాల్సి వచ్చేది. ఇకపై రాకెట్, శాటిలైట్ ప్రయోగాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులు ఉండవు. మనదేశం మరింత డబ్బును ఆదా చేసుకుంటుంది. ఈ అంశాన్ని డోజ్ పరిశీలించాలి. చాలా పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది” అని ట్రంప్ రాసుకొచ్చారు.
‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ బిల్లును వ్యతిరేకిస్తున్న మస్క్
ట్రంప్ తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ను ఎలన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు అమెరికా చట్టసభల్లో ఆమోదిస్తే, తానే ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని మస్క్ తేల్చి చెప్పారు. ఈ బిల్లు కారణంగా అమెరికా అప్పు ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తో ఆయనకు విభేదాలు తలెత్తాయి. కానీ, ఇటీవల ఈ బిల్లుకు సెనేట్ లో ఆమోదం లభించింది. దీనిని వ్యతిరేకిస్తూ మస్క్ ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన వారందరినీ వచ్చే ఎన్నికల్లో ఓడించేలా ప్రయత్నిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్.. మస్క్ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని భావిస్తున్నారు.
Read Also: ఆ ఈ మెయిల్స్ లీక్ చేస్తాం.. ఇరాన్ హ్యాకర్ల వార్నింగ్!