
క్రైమ్ మిర్రర్, నల్గొండ:- సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెక్కులు పంచుతుండగా, స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.సామెల్ అభిప్రాయం ప్రకారం తన నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ సహా ఇతర పథకాల లబ్ధిదారుల జాబితా ముందుగా తనకు తెలియజేయాలని, ఆ తర్వాత మాత్రమే పంపిణీ జరగాలని. ఎంపీని పక్కన పెట్టకుండా నేరుగా ప్రజలు వెళ్లి చెక్కులు తీసుకోవడం సరికాదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఎంపీ వర్గీయులు వెంటనే ఆగ్రహావేశంతో నినాదాలు ప్రారంభించడంతో సభా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల మాటల యుద్ధం కారణంగా కార్యక్రమం కొంతసేపు గందరగోళానికి గురైంది.
Read also : వరదల బీభత్సం.. వణికిపోతున్న ప్రజలు!
తుంగతుర్తి కాంగ్రెస్‌లో ఇలాంటి వర్గ విభేదాలు కొత్తకాదు. గతంలో కూడా ఎన్నోసారి ఎమ్మెల్యే-ఎంపీ వర్గాల మధ్య విబేధాలు బయటపడ్డాయి. స్థానిక నేతల మధ్య పోటీ, ఆధిపత్య పోరాటం పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నాయి. ఈ సారి కూడా ప్రజా కార్యక్రమంలోనే విబేధాలు బహిర్గతం కావడం చర్చనీయాంశమైంది. ప్రధానంగా, అధికారానికి కంటే ఆధిపత్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న నాయకుల ధోరణే తుంగతుర్తి కాంగ్రెస్‌లో సమస్యలకు మూలకారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read also : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు ఏపీలో భారీ వర్షాలు