క్రైమ్జాతీయం

పట్టణాల నుండి గ్రామాలకు పాకిన సైబర్ స్కామ్స్!… జాగ్రత్త?

మన భారత దేశంలో గత కొన్ని నెలలుగా సైబర్ స్కామ్లు అలాగే మోసాలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా మొబైల్స్ అనేవి కచ్చితంగా ఉంటున్నాయి కాబట్టి అది అదునుగా తీసుకొని చాలామంది సైబర్ కేటుగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పట్టణాలలో ఎక్కువగా సైబర్ స్కామ్స్ జరిగాయి. కానీ నేడు ఏకంగా పట్టణాల నుండి గ్రామాలకు పాకడంతో గ్రామాల్లో కూడా మోసాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఉపయోగించి పాపం పుణ్యం తెలియని వారి దగ్గర భారీగా డబ్బులను దోచేస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు రకరకాల పద్ధతులను అనుసరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

Read More : పుష్ప సినిమాకి బలైన మరో యువకుడు!..

ఉన్నతమైనటువంటి విద్యలు చదువుకున్న వారు కూడా సైబర్ స్కాం వలలో పడుతున్నారు. ప్రతిరోజు కూడా కొత్త అవతారం ఎత్తుతూ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల నుండి డబ్బులను సులభంగా దోచేస్తున్నారు. ఇక ఈమధ్య ఏకంగా టెలిగ్రామ్ లో తెలియని నెంబర్లనుండి మరియు గ్రూపుల నుండి చాలా లింకులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి వాటిని ఎవరూ కూడా క్లిక్ చేసి ఓపెన్ చేయకండి. పొరపాటున ఆ లింక్స్ క్లిప్ చేస్తే మీ పర్సనల్ డేటా అంతా కూడా సైబర్ నేరగాల చేతిలోకి వెళ్లేటువంటి ప్రమాదం పొంచి ఉంది. అలాగే గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఎటువంటి కాల్సు లేదా మెసేజ్ వస్తే వాటిని అసలు స్పందించకండి.

Read More : రూపాయి నాణేలతో ఐఫోన్ కొని షాక్ ఇచ్చిన బిచ్చగాడు?

ప్రతిరోజు కూడా కొన్ని వందల మందికి ఇలాంటి అనధికారికా లింక్స్ మరియు మెసేజెస్ వస్తున్నాయని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చేటువంటి మెసేజ్లకు మీరు కనుక స్పందిస్తే మీ ఆధార్ మరియు పాన్ కార్డు వివరాలన్నీ కూడా వారి చేతుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి సైబర్ స్కాం లలో ఇరుక్కుపోకుండా జాగ్రత్త పడాలని తెలంగాణ పోలీసులు ఎక్స్ వేదికగా వీడియోలను మరియు ఫోటోలను పోస్ట్ చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా తెలియనివారికి తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button