
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఇప్పట్లో ఎవరూ ఉండరు. ఎందుకంటే 90’s కాలం నుండి చిరంజీవి ఎన్నో ప్రత్యేకమైనటువంటి సినిమాలు చేసి ఎన్నో రికార్డులు సృష్టించాడు. నేడు మెగాస్టార్ చిరంజీవి లేదా మెగా ఫ్యామిలీ అంటే దానికి ప్రతిరూపం ఒక చిరంజీవి. ఇవాళ మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారంటే దానికి కారణం కూడా ఒక చిరంజీవి మాత్రమే. అలాంటి చిరంజీవి తన కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా స్టాలిన్. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కు సిద్ధం కాబోతుంది. ఆగస్టు 22వ తేదీన స్టాలిన్ సినిమా రిలీస్ చేయబోతున్నట్లు సమాచారం అందింది. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు… పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
స్టాలిన్ సినిమా రీ రిలీజ్ చేయడం అనేది చిరంజీవి అభిమానులకు పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా స్టాలిన్ సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కాగా ఈ సినిమాను మురగదాస్ డైరెక్ట్ చేయగా నాగబాబు నిర్మించారు. కాగా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా మొదటి నుంచి కూడా ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి. ఇక చివరిలో ఒకరు ముగ్గురికి సహాయం చేసి, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సహాయం చేయాలని చెప్పే కాన్సెప్ట్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తెగ ఆకట్టుకుంది. అప్పట్లోనే ఈ సినిమా మంచి సామాజిక మరియు సందేశాత్మక చిత్రంగా నిలవడంతో వసూళ్లలో కూడా ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.
తూప్రాన్‌లో బోనాల పండగ పూట విషాదం… వీధి కుక్కల స్వైరవిహారం, 25మందికి గాయాలు