
-
ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
-
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
క్రైమ్ మిర్రర్, చింతపల్లి : నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు శివారులోని పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్‌ఐ రామ్మూర్తి ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో ఐదుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి నాలుగు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.12,200 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.