
Chinese Minister Wang Yi India Visit: భారత్, చైనా మధ్య స్నేహం ఏర్పడుతోంది. అమెరికా టారిఫ్ యుద్ధం తర్వాత భారత్ ఆదేశానికి దూరం అవుతూ, చైనాకు దగ్గర అవుతోంది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటనకు రాబోతున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యపై చర్చించేందుకు సోమవారం ఆయన భారత్ కు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ఆయన సమావేశం కానున్నారు. తూర్పు లడాఖ్ లో 2020 సరిహద్దు వివాదం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది.
వచ్చే నెలలో మోడీ చైనా పర్యటన
అటు వచ్చే నెలలో చైనా పర్యటనకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. టియాంజిన్ వేదికగా షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటనకు రావడం ఆసక్తి కలిగిస్తోంది. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశం కానున్నారు. దైపాక్షిక చర్చల్లో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తోనూ వాంగ్ యీ భేటీ కానున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆహ్వానం మేరకు వాంగ్ యీ.. ఆగస్ట్ 18 నుంచి 20 వరకు భారత్ లో పర్యటించనున్నారని స్పష్టం చేసింది. భారత్ లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పర్యటనతో ఇరుదేశాల మధ్య సరిహద్దులకు సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: ట్రంప్, పుతిన్ 3 గంటల సమావేశం, చివరికి ఏం తేలకుండానే…