
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో చాలామంది పసిపిల్లలు కొన్ని దురదృష్ట కారణాల వల్ల చనిపోతున్నారు. కూల్ డ్రింక్ మూతలు, పల్లీ గింజలు లాంటివి తెలియక నోట్లో పెట్టుకోవడం వల్ల చాలామంది పసిపిల్లలకు గొంతుకు అడ్డుపడి.. చివరికి ఊపిరి అడగా మరణించిన సంఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. చిన్నపిల్లలు కాబట్టి ఏది తినాలి.. ఏది తినకూడదో అంతగా తెలియదు. అందుకే ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. కానీ చివరికి అది ప్రాణాల మీదకే తెస్తుందని ఎవరికి తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు చిన్నపిల్లలను నిత్యం గమనిస్తూ ఉండాలి. ఇక తాజాగా బాటిల్ మూత మింగి ఓ చిన్నారి.. గొంతులోపల్లి ఇరుక్కొని మరో బాలుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఊట్కూర్ గ్రామంలో రుద్ర అయాన్ 9 నెలల బాలుడు కూల్ డ్రింక్ మూత మింగి చనిపోయాడు. అలాగే మహబూబాబాద్ జిల్లా నాయకపల్లి గ్రామంలో అక్షయ్ అనే పద్దెనిమిది నెలల బాలుడు గొంతులో పల్లి ఇరుక్కొని ఊపిరాడక మరణించడం జరిగింది. కాబట్టి నిత్యం తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా ప్రతిక్షణం చూసుకోవాలని… ప్రతిక్షణం పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్లపై దృష్టి పెట్టి ఉంచాలని చెప్తున్నారు. నిండు నూరేళ్లు బతకాల్సిన పిల్లలు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు వల్ల జీవించిన కొన్ని రోజులకే మరణించాల్సి వస్తుంది.
ఫ్రాడ్ మెసేజెస్ పై తప్పకుండా ఫిర్యాదు చేయండి..
SLBC టన్నెల్లో మృతదేహాల ఆనవాళ్లు గుర్తింపు – సాయంత్రానికి బయటకి తీసే అవకాశం