
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణలో చాలా రోజుల తర్వాత చైల్డ్ ట్రాఫికింగ్ కలకలం రేపింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి గుర్తుతెలియని పిల్లలను తీసుకువచ్చి హైదరాబాదులో విక్రయిస్తుండగా.. సైబరాబాద్ పోలీసులు ఆ ముఠాను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 12 మందిని అరెస్టు చేసి వాళ్ల దగ్గర ఉన్నటువంటి ఇద్దరి పిల్లల్ని రక్షించారు. అంతేకాకుండా ఈ 12 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ సిటీలోని 8 ఆసుపత్రులకు ఏజెంట్లుగా పని చేస్తున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఒక్కొక్క శిశువుకు ఏకంగా 15 లక్షల వరకు లావాదేవీలు జరుగుతున్నట్లు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. దీంతో హైదరాబాదులో పోలీసులు కూడా ఒక్కసారిగా షాకు కు గురయ్యారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులుగా మీకు అనిపిస్తే ఖచ్చితంగా వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని పోలీసులు ఆదేశించారు. కాగా ఇటువంటి ఘటనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలుచోట్ల జరుగుతున్న అవి పోలీసుల దృష్టికి రాకపోవడంతో అంతర్గతంగా జరిగిపోతున్నాయి. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ తో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ పోలీసులు పలు ప్రాంతాలలో నిఘా ను ఏర్పాటు చేస్తున్నారు.
Read also : తొలిరోజే బీహార్ సంచలనం.. వీళ్లు ప్లేయర్ల, రస్సెల్ కొడుకులా?
Read also : T20 లలో షఫాలి వర్మ వరల్డ్ రికార్డ్..!





