తెలంగాణ

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ‘చిన్నారి మృతి’

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ :- మహాదేవ్ పూర్ మండలం అంబట్ పల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ళ చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే అంబట్ పల్లి గ్రామానికి చెందిన సింగనేని మల్లేష్ , భాగ్యలకు ఇద్దరు సంతానం మంగళవారం ఉదయం కుమారుని స్కూల్ బస్సు ఎక్కించే క్రమంలో ప్రమాదవశాస్తు వారి పాప స్కూల్ బస్సు టైర్ కిందపడి మృత్యువాత చెందింది, పాప టైర్ కింద ఉన్నది గమనించని బస్సు డ్రైవర్ ముందుకు వెళ్లడంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. సూరారం గ్రామంలోని ఒక ప్రయివేట్ పాఠశాల చెందిన బస్సుగా స్థానికులు గుర్తించారు. పాప మృతితో గ్రామంలో విషాదఛాయలు అలమకున్నాయి. పసితనంలోనే మృత్తి ఒడిలోకి చేరిన పాప మృతదేహాన్ని చూస్తూ గ్రామస్తులంతా కన్నీరు మున్నీరు అయ్యారు.

రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చిన్నారి బలి
పుట్టగొడుగుల వెళుతున్న ప్రైవేట్ పాఠశాలల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. సరైన అనుమతులు లేకున్నా సంబంధిత అధికారుల కళ్ళు కప్పుతూ పాఠశాల నిర్వహణ యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో అనుమవుకులైన ఉపాధ్యాయులు లేకుండానే విద్యాబోధన చేస్తూ, అనుభవజ్ఞులైన డ్రైవర్లు లేకుండానే స్కూల్ బస్సులు నడుపుతూ అక్రమార్జనే ధ్యేయంగా ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ జరుగుతుంది. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అంధకారంలో ఉండడంతో ప్రైవేట్ మాఫియా రెచ్చిపోతుంది. అనుభవజ్ఞులైన హెవీ లైసెన్స్ కలిగిన డ్రైవర్లను బస్సు డ్రైవర్ గా నియమించాలి. కానీ వేతనాలకు భయపడి స్కూల్ యాజమాన్యం బ్యాడ్జి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లను నియమించి చిన్నారుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. హెవీ లైసెన్స్ కలిగిన డ్రైవర్ నెలవారి వేతనం 18 వేల నుంచి 20,000 ఉండగా బ్యాడ్జి లైసెన్స్ కలిగిన వారికి 10 నుంచి 12000 వేతనం ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. సంబంధిత రవాణా శాఖ అధికారుల తనిఖీలు లేక ప్రైవేట్ పాఠశాల ఆగడలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. చిన్నారి మృతి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాగార్జునసాగర్ 14 గేట్లు ఎత్తిన అధికారులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button