
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల అయిలయ్య నూతన సంవత్సర క్యాలెండర్ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మా రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు గౌడ్, తాజామాజీ జెడ్పిటిసి కొడిత్యాల నరేందర్ గుప్తా,బీర్ల ఫౌండేషన్ కో ఆర్డినేటర్ బత్తిని ఉప్పలయ్య గౌడ్, సర్పంచులు సోలిపురం ఎల్లా రెడ్డి,పన్నాల సత్తి రెడ్డి,చిన్నం బీరప్ప,ఇంద్రాల అంజయ్య, మాజీ సర్పంచ్ జన్నాయికోడే నగేష్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,ఎన్ఎస్యూఐ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.





