
క్రైమ్ మిర్రర్, చండూరు:- ఆరు పడకలతో ఉన్న మునుగోడు నియోజకవర్గంలోని చండూరు ప్రభుత్వ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరింది. మంగళవారం ఆస్పత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆస్పత్రిని వారం, పది రోజుల్లో అద్దె భవనంలోకి మార్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బుధవారం తహసిల్దార్ దశరథ, వైద్యాధికారి మాస రాజు స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు, భవనాలను పరిశీలించారు. కస్తాల రూట్ లోని మరియానికేతన్ పాఠశాల భవనం అనుకూలంగా ఉందని గుర్తించారు. ఇందుకు పై అధికారుల నుంచి అనుమతులు రావాల్సి ఉంది.
ఇది ఇలా ఉంటే చండూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణానికి మంజూరి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇక్కడ ఆరు పడకల ఆసుపత్రి కాకుండా 30 పడకలు లేదా 50 పడకల ఆస్పత్రి భవనం నిర్మించాలనే డిమాండ్ ప్రజల నుంచి బాగా వ్యక్తం అవుతుంది. ఈ దిశగా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం చండూరు ప్రభుత్వ ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేసే యోచనలో ఉన్నారు. దీంతో ఆస్పత్రి భవన నిర్మాణం అయ్యేందుకు కొంత సమయం పట్టేలా కనబడుతుంది. ఏదేమైనా చండూరు ఆస్పత్రి స్థాయిని పెంచాలని ప్రజలు కోరుతున్నారు. కనీసం 30 పడకల ఆసుపత్రిగా మారిస్తే వైద్యుల సంఖ్య పెరిగి మరింత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. పోస్టుమార్టం కోసం నల్గొండ ప్రభుత్వాసుపత్రి వరకు వెళ్లే ఇబ్బంది కూడా ఉండదు.
ప్రజలకు అబద్ధాలు చెప్పలేకపోవడం వల్లే ఓడిపోయాం: మాజీ ముఖ్యమంత్రి
‘ఎమ్మేల్సీ’ పులి సరోత్తం రెడ్డిని గెలిపించాలి!… రాష్ట్రంలో మళ్లీ రాజకీయ గాలులు?
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి!.. జిల్లా వైద్యాధికారి