
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు. ఆయన 75వ సంవత్సరంలో అడుగుపెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయస్సు ఎనిమిది పదులకు దగ్గరవుతుంది. పార్టీ అధినేత జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న తెలుగు తముళ్లలో… ఈ టెన్షన్ కనిపిస్తోంది. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన లోకేష్‌కు.. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పట్టాభిషేకం చేయాలన్నది వాళ్ల ఆశ. ఇంకా ఆలస్యమైతే… ఇబ్బందులు తప్పవని తెలుగు తమ్ముళ్లు కంగారు పడుతున్నారు. ఈమధ్యనే…. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్‌ను కూడా చాలా మంది సీనియర్ నేతలు వినిపించారు. అయితే… పార్టీ ఆదేశాలతో… ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా గొంతులోనే నొక్కేసుకున్నారు.
చంద్రబాబు.. రాజకీయాల్లో తలపండిన నాయకుడు. ఏ పరిస్థితిని అయినా… తనకు అనుకూలంగా మార్చుకోగల చాణ్యుకుడు. ఎన్నో ఒడిదుడుకులను కూడా చూశారు. నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన వారసుడు నారా లోకేష్… రెండో దఫా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడిప్పుడే… పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు. పూర్తిస్థాయిలో పార్టీపై ఇంకా పట్టుసాధించలేదన్నది వాస్తవం. అంతేకాదు.. చంద్రబాబులా పొలిటిక్ చదరంగంలో రాటుదేలలేదు. ఈ పరిస్థితుల్లో లోకేష్‌కు పట్టాభిషేకం చేయడం మంచిది కాదన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. లోకేష్ ఇంకా మెలకవలు నేర్చుకోవాల్సి ఉంది… ప్రత్యర్థుల నుంచి రాబోయే ప్రమాదాలు, వారి వ్యూహాలను చెక్ పెట్టే విధానాలు లోకేషన్ ఒంటబట్టించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు… సమయం మించిపోకముందు… వారసుడి పట్టాభిషేకం జరిగితే బాగుంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. లోకేష్‌ను ముందపెట్టి… చంద్రబాబు వెనకుండి నడిపిస్తే బావుటుందని కోరుకునేవారు చాలా మందే ఉన్నారు. లేదంటే… బీజేపీతో కలిసి జనసేన అధికారాన్ని తన్నుకుపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన టీడీపీ నేతల్లో ఉంది. ఇదే పరిస్థితి ఒక్కప్పుడు కాంగ్రెస్‌లోనూ కనిపించింది. అప్పుడు… అవకాశం ఉన్నా… రాహుల్ గాంధీని ప్రధాని చేయలేకపోయారు. అప్పుడు… చేసుంటే.. కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి ఉండేది కాదని కాంగ్రెస్ సీనియర్ల అభిప్రాయం. అయితే… చేతులు కాలాగ… ఆకలు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు కదా. ఆ పొరపాటు చంద్రబాబు కూడా చేస్తారేమోనన్న ఆందోళన టీడీపీ క్యాడర్‌లో ఉంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటున్నారు. అధికారం ఉన్నప్పుడే… లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసి… చంద్రబాబు వెనకుండి… నడిపించాలని కోరుకునేవారు ఉన్నారు. మరి ఇది సాధ్యమేనా…? అన్నది తేలాలి.