
-
ఎమ్మెల్యేల వివాదాస్పద వ్యవహారం తలనొప్పిగా మారింది
-
ఎమ్మెల్యేల చేష్టలతో పార్టీకి నష్టం జరుగుతోంది
-
ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు: బాబు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణలతో కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి నష్టం చేకూర్చుతున్నారని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశం అనంతరం ఎమ్మెల్యేల వ్యవహారంపై చంద్రబాబు ప్రత్యేకంగా మంత్రులతో చర్చించారు. వివాదాస్పద ఎమ్మెల్యేల వ్యవహారాన్ని ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులే సెటిల్ చేయాలని చంద్రబాబు సూచించారు.
ఎమ్మెల్యేలు తలనొప్పిగా మారారు
టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా తయారయ్యారని చంద్రబాబు సీరియస్ అయ్యారు. సీమ ప్రాంతానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. గాడి తప్పుతున్న ఈ ఎమ్మెల్యేలను సెట్ చేయాల్సిన బాధ్యత మంత్రులు తీసుకోవాలని సూచించారు. తమ దగ్గరకు వస్తున్న ఫైళ్లను మంత్రులు త్వరగా క్లియర్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అనంతరం వివాదాస్పద ఎమ్మెల్యేల వ్యవహారంపై మంత్రి లోకేష్ లేవనెత్తారు. ముఖ్యంగా రాయలసీమ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినట్లు తెలుస్తోందని, వారు ఇకపై అలాంటి వ్యవహారాల్లో తలదూర్చవద్దని సూచించారు. ప్రభుత్వానికి గానీ, పార్టీకి గానీ నష్టం జరిగేలా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: