Gromor Chamatkar Zinc Awareness: వరినారు ఎంత ఆరోగ్యంగా ఉంటే, ధాన్యం దిగుబడి అంత ఎక్కువగా వస్తుందన్నారు గ్రోమోర్ సంస్థ నల్లగొండ ఏరియా మేనేజర్ రత్న సునీల్. నారు ఆరోగ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యాసంగిలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నారు దెబ్బతినకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతుల పొలాల దగ్గరికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం గ్రోమోర్ చమత్కార్ జింక్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా నారుమడులకు ఉచితంగా జింక్ స్ప్రే చేయిస్తున్నట్లు వివరించారు.
చలి తీవ్రతతో ఎర్రబడుతున్న నారుమడులు
యాసంగి సీజన్ కు సంబంధించి రైతులు నార్లు పోసుకున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నారు మడులు దెబ్బతింటున్నాయి. ముఖ్యమైన పోషకాలు మొక్కలకు సమర్థవంతంగా అందకపోవడం ఎర్రబారుతున్నాయి. కొన్ని చోట్ల చనిపోతున్నాయి కూడా. ఈ సమస్యను అధిగమించడానికి, నారుమడిలో ప్రారంభ దశలోనే జింక్ అందించడం చాలా ముఖ్యం. ఈ సమస్యకు గ్రోమోర్ చమత్కార్ జింక్ రైతులకు మంచి పరిష్కారాన్ని అందిస్తోంది. చలి కారణంగా పోషకాల లోపాన్ని అధిగమించేందుకు చమత్కార్ జింక్ ప్రభావాన్ని వివరించేందుకు గ్రోమోర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, డెమోలను నిర్వహిస్తుంది.
నారు మడులకు ఉచితంగా జింక్ స్ప్రే
గ్రోమోర్ చమత్కార్ జింక్ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. సిబ్బంది గ్రామాలకు వెళ్లి నేరుగా రైతుల నారు మడులకు జింక్ పిచికారీ చేస్తున్నారు. డబ్బులు తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో చమత్కార్ జింక్ ప్రయోజనాలు, దాని పనితనం, నారుమడిలో జింక్ అవసరం గురించి రైతులకు వివరించారు. నారుమడిలో ప్రత్యక్ష స్ప్రే డెమో నిర్వహించారు.
గ్రోమోర్ సెంటర్లను సంప్రదిస్తే ఉచిత జింక్ స్ప్రే
గ్రోమోర్ అందిస్తున్న ఉచిత జింక్ స్ప్రే సౌకర్యాన్ని రైతులు ఉపయోగించుకోవాలని గ్రోమోర్ ఏరియా మేనేజర్ రత్న సునీల్ తెలిపారు. ఎవరైనా తమ నారుమడికి జింక్ పిచికారీ చేయించుకోవాలంటే, మన గ్రోమోర్ సెంటర్ ను సంప్రదిస్తే, సిబ్బంది వచ్చి ఉచితంగా పిచికారీ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించాలని నల్లగొండ జిల్లాలోని అన్ని గ్రోమోర్ కేంద్రాల మేనేజర్లుకు సూచించారు. తమ పరిధిలోని గ్రామాల్లో రైతులను సంప్రదించి చమత్కార్ జింక్ డెమోలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రోమోర్ అందిస్తున్న ఈ ఉచిత సర్వీసును ఉపయోగించుకోవాలని అన్నదాతలకు రత్న సునీల్ సూచించారు.





