క్రీడలువైరల్

Chahal: పెళ్లికి రెడీ.. అమ్మాయి కావాలి

Chahal: భారత క్రికెట్ అభిమానుల్లో యుజ్వేంద్ర చాహల్ అనే పేరు తెలియని వారు లేరు. తక్కువ కాలంలో తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఆటగాడు..

Chahal: భారత క్రికెట్ అభిమానుల్లో యుజ్వేంద్ర చాహల్ అనే పేరు తెలియని వారు లేరు. తక్కువ కాలంలో తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఆటగాడు.. ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ, ఐపీఎల్ వంటి లీగ్ టోర్నమెంట్లలో మాత్రం తన ప్రతిభను నిరూపిస్తూ కొనసాగుతున్నాడు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఎన్నో సీజన్ల పాటు ఆడిన చాహల్, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మైదానంలో ఎప్పుడూ ఓర్పుతో ఆడే ఈ స్పిన్నర్.. ఈసారి సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టుతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నానని, సరైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నానని చెప్పే విధంగా పెట్టిన పోస్టు క్షణాల్లోనే వైరల్ అయింది. బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్‌గా ఉన్న ఫోటోలు కూడా జత చేయడంతో ఆ పోస్టుకు మరింత స్పందన పెరిగింది.

ఈ పోస్టు చూసిన నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కలా కామెంట్లు చేస్తున్నారు. కొందరు చాహల్ ఒంటరిగా ఉన్నాడని, వెంటనే అతనికి సరైన వరుడు కనుగొనాలని సూచిస్తుండగా, మరికొందరు అతని వ్యక్తిగత జీవితంపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడిపోయిన తర్వాత చాహల్ చాలా కష్టమైన సమయంలో ఉన్నాడని భావిస్తూ, అతనికి మద్దతు తెలుపుతున్నారు. 2020లో పెళ్లి చేసుకున్న ఈ జంట, రెండు సంవత్సరాల పాటు కలిసి జీవించిన తరువాత, మధ్యలో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2025 ఐపీఎల్ సమయంలో కోర్టు వారి విడాకులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చాహల్ ధనశ్రీ వర్మకు నాలుగు కోట్లకు పైగా భరణం చెల్లించినట్లు సమాచారం.

విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ జీవితాలను మళ్లీ కొత్తగా ఆరంభించినట్లు కనిపిస్తున్నారు. యుజ్వేంద్ర చాహల్ ఓ దశలో ఆర్జే మహ్వాష్ అనే యువతితో డేటింగ్‌లో ఉన్నారని, ఇద్దరూ కలిసి ముంబైలో ఫ్లాట్ తీసుకొని లివింగ్ రిలేషన్‌షిప్ కూడా ప్రారంభించారని వార్తలు వచ్చాయి. అయితే తరువాత ఏమైందో తెలియదు కానీ, ఈ ఇద్దరూ పబ్లిక్‌గా కనిపించడం తగ్గిపోవడంతో ఆ వార్తలు నెమ్మదిగా చల్లారిపోయాయి. ఇంతలో ధనశ్రీ వర్మ మాత్రం సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా కొనసాగుతూ, టాలీవుడ్‌లో ఓ సినిమా ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్లు సమాచారం. విడాకుల తర్వాత ఇద్దరి జీవితాలు వేర్వేరు దారుల్లో సాగుతున్నాయి కానీ, చాహల్ ఇటీవల చేసిన పెళ్లి పోస్టుతో మరోసారి వారి వ్యక్తిగత జీవితం ప్రజల్లో చర్చనీయాంశమైంది.

ALSO READ: Gold Rate: కొండెక్కిన బంగారం, వెండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button