
CM Rekha Gupta Z-Category Security: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు కల్పించిన జెడ్ కేటగిరీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇకపై ఆమెకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించనున్నట్లు వెల్లడించింది. రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆమెకు z+ భద్రత కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. నిజానికి చాలా మంది ఈ భద్రతను కొనసాగిస్తారని భావించారు. కానీ, తాజాగా ఆమెకు కేటాయించిన భద్రతను తొలగిస్తున్నట్లు తెలుస్తున్నాయి. ఇకపై ఆమె భద్రత వ్యవహారాలను ఢిల్లీ పోలీసులు పర్యవేక్షించనున్నారు.
జన్ సున్ వాయి వేడుకలో రేఖా గుప్తాపై దాడి
తాజాగా ఢిల్లీలో జన్ సున్‌వాయి కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సఖ్రియా రాజేశ్ భాయ్ ని ఆటో డ్రైవర్ గా గుర్తించారు. అతడి సొంతూరు గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందినట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తులో భాగంగా పోలీసులు.. సీఎం నివాసంలో భద్రతా లోపాలను గుర్తించారు. ఈ లోపాల కారణంగా ఆమెకు ముప్పు కలిగే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.