
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన భారతదేశంలో జనగణన కసరత్తు మళ్ళీ ప్రారంభమైంది. వచ్చే నవంబర్ నెల 10వ తేదీ నుంచి 35వ తేదీ మధ్యన అన్ని రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసినటువంటి ఏరియాల్లో హౌస్ లిస్టింగ్ అలాగే హౌస్ సెన్సెస్ చేపడుతున్నట్లుగా సమాచారం. 2027 లో జనగణన తొలి దశ ప్రారంభమవుతుంది అని అధికారులు తెలియజేశారు. సాధారణంగా ఈ జనగణన అనేది దేశ అభివృద్ధి అలాగే ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి ఈ జనగణన నిర్వహిస్తుంటారు. ఈ జనగణన విధానం ప్రకారమే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవడం లేదా ప్రజలకు సంక్షేమ పథకాలలో మార్పులు తేవడం వంటివి చేస్తారు. మన భారతదేశంలో 1872వ సంవత్సరం నుంచి జనగణన చేస్తూ ఉన్నారు. ఇక మనదేశంలో చివరిసారిగా 2011లో ఈ జనగణన జరిగింది. దీంతో దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ జనగణన అనే మాట తెరపైకి రావడంతో కాస్త ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జనగణన ద్వారానైనా ప్రజల పరిస్థితులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read also : నటులలో దేవుడు మహేష్ బాబే.. 5000 కు చేరిన ఉచిత గుండె ఆపరేషన్లు
Read also : స్థానిక సంస్థల ఎన్నికల పోటీ పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన