
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురు చూసే సెలబ్రిటీల క్రికెట్ లీగ్ అయితే ఇవాల్టి నుండి ప్రారంభం కానుంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 11వ సీజన్ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటగా బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా చెన్నై రైనోస్ VS బెంగాల్ టైగర్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో చెన్నై నుంచి అంటే తమిళనాడు స్టార్ హీరోలు, లేదా నటులు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు బెంగాల్ టీం నుంచి కొంతమంది స్టార్ నటులు ఆడనున్నారు.
నేడే ఫలితాలు విడుదల!… మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీలు?
ఇక మరోవైపు సాయంత్రం 6 గంటలకు తెలుగు వారియర్స్ VS కర్ణాటక బుల్డోజర్ మధ్య మ్యాచ్ జరుగునుంది. ఇందులో తెలుగు నటులు తెలుగు వారియర్స్ టీం తరఫున ఆడనున్నారు. కాగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అనేది ఇవాల్టి నుంచి ప్రారంభమై మార్చి రెండవ తారీకు వరకు కొనసాగునుంది. ఈ క్రికెట్ టోర్నీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన కొంతమంది ప్రేమకు స్టార్లు బ్యాట్ మరియు బంతితో సత్తా చాటనున్నారు. కాగా ఈనెల 14 మరియు 15వ తేదీలలో హైదరాబాద్ లో నాలుగు మ్యాచ్లు జరుగునున్నాయి. కాబట్టి కొంతమంది సినిమా స్టార్ హీరోలను క్రికెట్ ఆడుతూ చూడాలని అనుకునే వారు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోండి. ఈ క్రికెట్ టోర్నీలో అక్కినేని అఖిల్, కిచ్చా సుదీప్, సోను సూద్ లాంటి ప్రముఖ స్టార్ నటులు ఆడనున్నారు.
ఇంకోసారి కుల మత ద్వేషాలను రెచ్చగొడితే ఊరుకోను!.. రాహుల్ గాంధీకి వార్నింగ్ ఇచ్చిన మోడీ?