
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- మన భారతదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎలా నిర్వహిస్తున్నారో.. ఆయా దేశాలు… టి20 లీగ్ లను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో బవుమాకు మళ్ళీ అవమానం ఎదురయింది. ఎందుకంటే తాజాగా జరిగిన సౌతాఫ్రికా t20 లీగ్ వేలంలో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ను ఏ జట్టు కూడా పట్టించుకోలేదు. అలాగే రెండు లక్షల ర్యాండ్ ల బేస్ ప్రైస్ తో వేలం లోకి వచ్చిన అతనిపై ఏ ఒక్క ఫ్రాంచైజ్ కూడా ఆసక్తి చూపించలేదు. దీంతో సౌత్ ఆఫ్రికా t20 వేలంలో బవుమా అన్ సోల్డ్ గా మిగిలిపోయారు. అయితే గత సీజన్లో కూడా సౌత్ఆఫ్రికా t20 లీగ్ వేళంలో బవుమా ను ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా బవుమా అభిమానులు కావాలనే అవమానిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
Read also : కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ముదిరిన వార్.. RRR కేంద్రంగా సై అంటే సై
కాగా మొత్తం టి20 ఫార్మాట్లో బవుమా 36 మ్యాచుల్లో 118 స్ట్రైక్ రేట్ తో 670 పరుగులు మాత్రమే చేశారు. గతంలో దక్షిణాఫ్రికా t20 జట్టుకు బవుమా నాయకత్వం కూడా వహించారు. కానీ చాలా సందర్భాల్లో బవుమాను ఆ దేశ క్రికెటర్లే అవమానిస్తూ ఉన్నారని సోషల్ మీడియాలో ఎంతగానో ప్రచారం జరుగుతుంది. తక్కువ జాతిలా చాలామంది అభిప్రాయపడుతూ అవమానిస్తున్నారన్నట్లుగా కూడా ప్రచారాలు జరిగాయి. పొట్టి వాడే కానీ బవుమా అన్ని ఫార్మేట్ లలో చాలా బాగా రాణిస్తూ కెప్టెన్ గా పేరు కూడా సంపాదించారు. సౌత్ ఆఫ్రికా దేశానికి కెప్టెన్గా వ్యవహరించిన బవుమాను ఆ దేశం నిర్వహించే టి20 లీగ్ లో మాత్రం ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. దీంతో చాలామంది నెటిజనులు సోషల్ మీడియా వేదికగా కావాలనే బవుమా ను అవమానిస్తున్నారని వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read also : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్.. సీఎం రేవంత్ బిగ్ ట్విస్ట్!