తెలంగాణ

చిల్లర కేసులకు భయపడతామా.. వీరేశంకు జగదీశ్ రెడ్డి వార్నింగ్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గురుశిష్యుల మధ్య వార్ సాగుతోంది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య రాజకీయ రచ్చ ముదురుతోంది. నకిరేకల్ లో వెలుగు చూసిన టెన్త్ పేపర్ లీకేజీ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. పేపర్ లీకేజీపై అసత్య ప్రచారం చేశారంటూ అధికారుల ఇచ్చిన ఫిర్యాదుతో రెండు కేసులు నమోదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా కేసు పెట్టారు. ఇదే ఇప్పుడు రచ్చగా మారుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఎమ్మెల్యే వేముల వీరేశమే కేసులు పెట్టించారని బీఆర్ఎస్ ఆరోపిస్తంది.

టెన్త్ పేపర్ లీక్ విషయం పక్కదారి పట్టించడానికి కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టి చిల్లర ప్రయత్నం చేశారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. పదవ తరగతి పరీక్షలు కూడా సరిగా నిర్వహించడం చేతగాని ప్రభుత్వమని మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నదని రేవంత్ ప్రభుత్వమని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.నకిరేకల్‌లో కేటీఆర్ పై పెట్టిన కేసు చిల్లర కేసని చెప్పారు. సీఎం రేవంత్ డైరెక్షన్ లొనే కేస్ పెట్టారని.. పరీక్షలు సరిగా నిర్వహించమని కోరితే కూడా కేసులు పెడుతున్నారని విమర్శించారు.

Also Read : ప్రమాదమా..? హత్యా..? 12 సెకండ్ల ముందు ఏం జరిగింది – పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై ఎన్నో అనుమానాలు..!

ప్రశ్నించిన వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారు.. బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు కేసులు కొత్త కాదు,, పోరాడటం కొత్త కాదని జగదీశి రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆర్డర్ రాగానే సెకండ్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు.. పేపర్ లీకేజీ కేసులో అసలు నిందితులను తప్పించారని ఆరోపించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు మానుకోవాలని.. పోలీసులు చట్ట ప్రకారం నడుకుంటే మంచిదని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. తాము న్యాయ పరంగా కొట్లాడుతాం.. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.. మిము అధికారంలోకి వచ్చాక అన్ని తెలుస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి .. 

  1. కదలుతున్న రైలులో అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్

  2. ఐదుగురు నన్ను లైంగికంగా వేధించారు- కన్నీరుపెట్టుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌

  3. బిర్యానీ సెంటర్‌ లో భారీ పేలుడు.. చెల్లా చెదురుగా బయటపడ్డ వస్తువులు!

  4. సర్పంచ్ పదవి కోసం తండ్రిని చంపించిన కూతురు.. సూర్యాపేట జిల్లాలో దారుణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button