
CDS Anil Chauhan: భారతీయ రక్షణ సామర్థ్యాన్ని మరింత ఆధునీకరించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. రేపటి టెక్నాలజీకి అనుగుణంగా ఇవాళ్టి యుద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. నిన్నటి ఆయుధాలో ఇవాళ్టి యుద్ధాన్ని గెలవలేమన్నారు. భారత రక్షణ వ్యవస్థ రోజు రోజుకు మరింత టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నప్పటికీ, ఇంకా అప్ డేట్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో జరిగిన యూఏవీ, కౌంటర్ అన్ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ స్వదేశీకరణ వర్క్ షాప్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
విదేశీ టెక్నాలజీ మీద ఆధారపడొద్దు!
భారత ప్రభుత్వం రక్షణ రంగానికి పెద్ద పీట వేస్తుందని అనిల్ అన్నారు. అయినప్పటికీ, రక్షణ వ్యవస్థను ఇంకా ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ వ్యూహాత్మక మిషన్ల కోసం కీలకమైన సాకేతికతకు సంబంధించి విదేశాల మీద ఆధారపడటం తగ్గించుకోవాలన్నారు. దిగుమతి చేసుకున్న టెక్నాలజీ మీద ఆధారపడితే మన సంసిద్ధత దెబ్బతింటుందన్నారు. అందుకే స్వదేశీ సాంకేతికతను వీలైనం త్వరగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆపరేషన్ సిందూర్ పై కీలక వ్యాఖ్యలు
అటు ఈ ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్ పై అనిల్ స్పందించారు. దేశ సరిహద్దుల వెంబడి నిరాయుధ డ్రోన్లు, మందుగుండు సామగ్రిని పాకిస్థాన్ మోహరించిందన్నారు. అయినప్పటికీ, వాటిని సమర్ధవంతంగా నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు. యూఏవీల కారణంగానే భారత సైన్యానికి, భారత పౌరుల మౌళిక సదుపాయలకు ఎలాంటి నష్టం వాటిళ్లలేదన్నారు అనిల్ చౌహాన్.
Read Also: బాధిత కుటుంబం షాకింగ్ నిర్ణయం.. ఇక నిమిషకు ఉరి తప్పదు!