Wednesday, March 18, 2026
Homeజాతీయంచీమ కుడితే ప్రాణం పోతుందా?

చీమ కుడితే ప్రాణం పోతుందా?

చీమలు అనగానే మనం సాధారణంగా చిన్నచూపు గల జంతువులను మాత్రమే ఊహిస్తాము. కానీ ప్రకృతిలో కొన్ని జాతుల చీమలు అత్యంత ప్రమాదకరమైన విషాలను కలిగి ఉంటాయని తెలుసుకుంటే షాక్ అవ్వాల్సి ఉంటుంది. అవును, ఇది నిజమే. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీమగా బుల్‌డాగ్ చీమ ప్రసిద్ధి చెందింది. ఈ చీమ ఆస్ట్రేలియాలో నివసిస్తుంది. దీని కుట్టు వల్ల మనిషి కొద్ది నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవచ్చు. అలాగే, ఫైర్ ఆంట్స్ తమ గ్రూప్‌తో దాడి చేస్తాయి. వీటి కుట్టు తీవ్రమైన నొప్పి కలిగిస్తుంది, అలర్జీ ఉన్నవారికి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఫ్లోరిడా హార్వెస్టర్ చీమ తన విషపూరిత కాటుతో తీవ్రమైన వాపును, ఎర్రదనం, బాధ కలిగిస్తుంది. చివరగా, గ్రీన్ ట్రీ ఆంట్స్ చెట్లపై నివసిస్తూ తమ గూడును రక్షించడానికి అత్యంత దూకుడుగా దాడి చేస్తాయి. ఈ నాలుగు రకాల చీమల విషపూరిత రసాయనాలు కుక్కలు, ఇతర జంతువులను కూడా హతమార్చగలవని తెలుసుకోవాలి.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 4 చీమలు..

1. బుల్‌డాగ్ చీమ: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర చీమ. దీని దవడలతో గట్టిగా పట్టుకుని, వెనుక భాగంలోని ముల్లుతో విషాన్ని శరీరంలోకి పంపిస్తుంది. దీని కుట్టు వల్ల సుమారు 15 నిమిషాల్లో మనిషి ప్రాణాలు కోల్పోవచ్చు.

2. ఫైర్ ఆంట్స్/ అగ్ని చీమలు: ఇవి ప్రధానంగా దక్షిణ అమెరికా నుండి మొదలై, ఇప్పుడు ఆసియా, ఆస్ట్రేలియా అంతటా వ్యాప్తి పొందాయి. వీటి సమూహ దాడి చాలా ప్రమాదకరం. కుట్టినప్పుడు చర్మంపై నిప్పుతో కాల్చినట్లే తీవ్ర మంట పుడుతుంది. అలర్జీ ఉన్నవారికి ప్రాణాంతకం కావచ్చు. వీటి విషం పంటలకు, చిన్న జంతువులకు కూడా ముప్పుగా ఉంటుంది.

3. ఫ్లోరిడా హార్వెస్టర్ చీమ: అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో ఉండే విషం చాలా శక్తివంతంగా ఉంటుంది. కుట్టిన చోట తీవ్ర వాపు, ఎర్రదనం, భరించలేని నొప్పి కలుగుతుంది. వీటి గూడును రక్షించడానికి ఈ చీమలు అత్యంత దూకుడుగా దాడి చేస్తాయి.

4. గ్రీన్ ట్రీ ఆంట్స్: ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియా అడవులలో నివసిస్తాయి. చెట్ల ఆకులపై పెద్ద గూళ్లు కట్టుకుని ఉంటాయి. ఎవరైనా వాటి గూడును తాకితే వేల సంఖ్యలో చీమలు ఒకేసారి దాడి చేస్తాయి. వీటి కుట్టు వల్ల తీవ్ర నొప్పి, నీరసం, స్పృహ కోల్పోవడం వంటి ప్రభావాలు ఏర్పడవచ్చు.

పరిమాణంలో చిన్నవైనా ఈ చీమలు తమ ఆత్మరక్షణ కోసం ప్రకృతి ఇచ్చిన కెమికల్ వెపన్స్‌ను వాడతాయి. అడవులకు లేదా తెలియని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి కీటకాల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. బుల్లెట్ ఆంట్ కూడా అత్యంత ప్రమాదకరమైనది. దీని కుట్టు వల్ల కలిగే నొప్పి తుపాకీ గుండు తగిలినంత తీవ్రంగా ఉంటుంది.

ALSO READ: జోస్యం చెప్పిన ఏబీ డివిలియర్స్.. వాడున్నంతవరకు టీమిండియాకు కొదవే లేదు..

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments