Union Cabinet Key Decisions: ప్రధాని నరేంద్ర మోడీఅధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జనగణన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వంటి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
❂ 2027లో రెండు విడతల్లో జరగనున్న జనగణన కోసం రూ.11,718 కోట్ల బడ్జెట్‌ను కేబినెట్ ఆమోదించింది.
❂ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఒక కుటుంబానికి ఏడాదికి ఉన్న గరిష్ఠ పని దినాలను 100 నుంచి 120 రోజులకు పెంచింది. రోజు కూలీని రూ.240గా నిర్ణయించింది.
❂ పీఎం కిసాన్ సమ్మాన్ యోజన.. ఈ పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ.10,000 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది.
❂ దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్ కి 4 మంజూరు చేసింది.
❂ నాలుగు కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం
❂ పీఎం కిసాన్ సంపద యోజన.. ఈ పథకానికి రూ.6,520 కోట్లు కేటాయింపు.
❂ క్వాంటం టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి అదనంగా రూ.4,000 కోట్ల నిధులు కేటాయింపు
❂ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ లకు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు లభించేందుకు వీలుగా రూ.15,000 కోట్లతో కొత్త క్రెడిట్ గ్యారెంటీ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
❂ దేశంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించడనాకి సైబర్ దాడులను నిరోధించడానికి సైబర్ సెక్యూరిటీ పాలసీకి ఆమోదం.
❂ సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.12,000 కోట్లు కేటాయింపు. కొత్త సెమీకండక్టర్ తయారీ కర్మాగారాలను నెలకొల్పే సంస్థలకు ఆర్థిక సహాయం పెంపు.
❂ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 1.5 కోట్ల గృహాలను నిర్మించడానికి ఆమోదం తెలిపింది.
❂ చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి వీలుగా తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద కొత్త ప్రయోగ వేదిక నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
❂ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని రక్షణ రంగంలో బలోపేతం చేయడానికి, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI) పరిమితి పెంపు
❂ 50 ప్రధాన, మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి రూ.35,000 కోట్లతో ఒక కొత్త జాతీయ మిషన్‌ను ప్రారంభించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది.





