
ఆడబిడ్డల పండుగ రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ సర్కార్ ఆడబిడ్డలకు షాకిచ్చింది. మహాలక్ష్మి పథకాన్ని గొప్పగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. పండగ పూటే మహిళామణులకు బస్సు ఛార్జీలు పెంచి బహుమతి ఇచ్చింది. రాఖీ పౌర్ణమి రద్దీని క్యాష్ చేసుకుని కాసుల గలగలం కోసం అడ్డగోలుగా ఆర్టీసీ బాస్సు ఛార్జీలు పెంచింది. చికెన్ రేట్ల తరహా ఆర్టీసీ ఛార్జీలు ఎప్పుడూ ఎలా ఉంటాయో తెలియడం లేదని ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్జిని దుమ్మెత్తి పోస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 50–100 శాతం బస్సు ఛార్జీలను పెంచారు ఆర్టీసీ అధికారులు. నల్గొండ టు మిర్యాలగూడ మామూలు సమయంలో బస్సు ఛార్జీ 60 రూపాయలు ఉండగా.. రాఖీ పండుగ సందర్భంగా 120 రూపాయలకి పెంచారు. ఎల్బీ నగర్ నుండి సూర్యాపేటకు 2 వందల రూపాయలు ఉన్న బస్సు చార్జీని 310 రూపాయలకి పెంచారు. జేబీఎస్ టు కామారెడ్డి బస్సు ఛార్జీ 240 రూపాయల నుండి 340 రూపాయలకి పెంచారు.
జేబీఎస్ నుండి కరీంనగర్‌కు 160 రూపాయలు.. నాగర్ కర్నూల్ నుండి హైదరాబాద్‌కు వంద రూపాయలు.. నాగర్ కర్నూల్ నుండి కొల్లాపూర్‌కు 30 రూపాయలు చార్జీ పెంచారు ఆర్టీసీ అధికారులు. కల్వకుర్తి నుండి హైదరాబాద్‌కు 50 రూపాయలు హైక్ అయింది. ఇష్టమొచ్చినట్లు అడ్డగోలుగా రేట్లు పెంచారంటూ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.