తెలంగాణ

బీఎస్సీ చదివి… టీ కొట్టు పెట్టి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన యువకుడు

క్రైమ్ మిర్రర్ / వికారాబాద్ జిల్లా ప్రతినిధి:-బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబంతో హ్యాపీగా సెటిల్ అవ్వాలి. ఈ విషయాన్ని ప్రతి యువకుడు అనుకుంటూ ఉంటారు. మంచి ఉద్యోగం సాధిస్తే లైఫ్ సెట్ అయినట్లే భావిస్తారు. అయితే కొందరు నలుగురు నడిచే బాటలో నడవకుండా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవుతూ ఉంటారు.ఇలా సక్సెస్ అయిన యువకుడే మిస్టర్ గణేష్ ఆ యువకుడి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. గణేష్ అనే యువకుడు బీఎస్సీ చదివాడు..ఈస్ట్ ఫార్మా కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగం వదిలి ఇంటికి పరిమితమయ్యాడు.ఉన్నత చదువు చదివానని ఏనాడూ గొప్పలకు పోలేదు. సొంత వ్యాపారం వైపు మొగ్గు చూపాడు.వివిధ రకాల చాయ్ రుచులు పంచుతూ వ్యాపారం చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటూనే ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం ఆర్కతల గ్రామానికి చెందిన తలారి గణేష్ వికారాబాద్ లోని తక్షశిల కళాశాలలో బీఎస్సీ చదువుతూ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇటు ఈస్ట్ ఫార్మా కంపెనీలో పనిచేశాడు.

2023 ఉద్యోగం పర్మనెంట్ అయినా కూడా ఇంకా తనలో ఉన్న ప్రతిభను ప్రైవేట్ వ్యాపార పరంగా రాణించాలని కుతూహలంతో ఇంటికి తిరిగి వచ్చాడు.వ్యవసాయం కుటుంబ నేపథ్యం కావడంతో తనకు ఇష్టమైన మిస్టర్ చాయ్ వ్యాపారాన్ని కొనసాగించాడు. ఉన్నత చదువులు చదివమన్న భావనతో చాలా మంది యువకులు పనిచేయకుండా కాలక్షేపం చేస్తున్న నేటి రోజుల్లో బీఎస్పీ మ్యాస్ వంటి ఉన్నత చదువు చదివిన గణేష్ అనే యువకుడు తపన ఉంటే ఏదైనా చేయవచ్చని సంకల్పంతో ప్రవేట్ వ్యాపారాన్ని ఎంచుకొని ఆదర్శంగా నిలుస్తున్నాడు.

చిన్నతనం నుంచే సొంత బిజినెస్ లో రాణించాలని ఆశ…

తలారి గణేష్ -నవాబ్ పేట్ మండలం.ఆర్కతల గ్రామం

చదువుతోపాటు ఈస్ట్ ఫార్మా కంపెనీలో ఉద్యోగిగా చేరా.తన ప్రతిభకు మంచి హోదా ఉద్యోగంలో చేరిన కూడా ఈ ఉద్యోగం సంతృప్తిని ఇవ్వలేదు.కారణం నాకు సొంత బిజినెస్ పై ఉన్నటువంటి మక్కువే. ఇలా అన్న అభిరుచులను గుర్తించిన స్నేహితులు కుటుంబీకులు ఆ దిశగా ప్రోత్సహించారు.దీంతో ఉద్యోగాన్ని వదిలి “*మిస్టర్ చాయ్*”అనే సొంత వ్యాపార బిజినెస్ ప్రారంభించాను. మొదట్లో వ్యాపారంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఇప్పుడు బాగానే ఉందని మిస్టర్ చాయ్ వాలా గణేష్
చెప్పారు.మిస్టేక్ చాయ్ కొత్త కొత్త రుచులను చాయ్ ప్రియులకు పంచుతూ ఒక కొత్త ప్రణాళికను ఎంచుకున్నానని అన్నారు.ప్రైవేట్ సంస్థలో పని చేయడం కంటే ఇంటి వద్దే ఉంటూ తల్లిదండ్రులను చూసుకుంటూ సొంత వ్యాపారంలో రాణించడం సంతోషాన్నిస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ క్లాస్… స్పందిస్తూ సీఎంపై సెటైర్లు వేసిన కేటీఆర్

సీఎం రేవంత్‌రెడ్డి.. కిషన్‌రెడ్డిని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు..? – దీని వెనకున్న పొలిటికల్‌ స్ట్రాటజీ ఏంటి..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button