
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్*:- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ పండుగకు మహిళలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మహాదేవ్ పూర్ మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్టమదు ఆదేశానుసారం సమీకరణ కోసం ఇంటింటా తిరిగి మహాసభకు తరలిరావాలని పిలుపచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేసి అమలు కానీ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ ప్రభుత్వం కనీసం గ్రామపంచాయతీ బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉందన్నారు. రైతుబంధు ఎగ్గొట్టి వచ్చిన మోసపూరిత ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందన్నారు రజితోత్సవ సభకు భారీ స్పందన లభిస్తుందన్నారు.
తెలంగాణ సాంస్కృతిక సారథి సెగ్గం శిరీష కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం