క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఎంపీల పై మండిపడ్డారు. 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది మాత్రం గుండు సున్నా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతమంది ఎంపీలు ఉన్నా కూడా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చిల్లిగవ్వ సాధించలేకపోయిందని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణమే కాంగ్రెస్ 16 మంది ఎంపీలు అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మరియు బిజెపి నుంచి వచ్చిన 16 మంది ఎంపీల వల్ల రాష్ట్రానికి ఎటువంటి న్యాయం జరగలేదని , వీళ్ల వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదని అన్నారు.
80 ఏళ్ల చరిత్ర కలిగిన శంకరమఠం కూరగాయల మార్కెట్ ను జెసిబి లతో కూలగొట్టిన అధికారులు!..
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలు ఎప్పటికీ కూడా ప్రజలకు ప్రయోజనాలు చేయలేవని , రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించలేవని అన్నారు. జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేవని తెలిపారు. బడే భాయ్ – చోటే బాయ్ అనే బంధంతో ఎటువంటి లాభం లేదని అన్నారు. కేంద్రానికి తెలంగాణపై చిన్నచూపు ఉందని మరోసారి రుజువైందని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాగా కేంద్రం నుంచి బడ్జెట్లో తెలంగాణకు ఎక్కువగా బడ్జెట్లను ప్రవేశ పెట్టలేదు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం.. నగర శివార్లలో ఓ హోటల్‌లో 11 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం!!!??