
క్రైమ్ మిర్రర్, చండూరు : మునుగోడు డివిజన్ వ్యవసాయ శాఖకు తెగులు అంటుకుంది. ఎప్పటికప్పుడు నిఘా పెట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందేలా చూడాల్సిన అధికారులే మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ప్రతి ఎరువుల దుకాణ వ్యాపారి ఏడాదికి 10వేలకు పైగా మామూలు అధికారులకు ముట్ట చెప్పాల్సిందేనని తెలుస్తోంది. ఇటీవలే మునుగోడు డివిజన్ పరిధిలోని 120 కి పైగా ఎరువుల దుకాణాల నుంచి క్కో దుకాణం నుంచి రూ.10 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు ఓ అధికారి ఒకరు ఒత్తిడి తెచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. పైగా మా సారు ఈ వసూళ్ల డబ్బుతో కారు కొనుగోలు చేయాల్సి ఉందని కొందరు కింది స్థాయి సిబ్బంది దుకాణా దారులతో అన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అనేక పథకాలతో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వ పనిచేస్తుంటే ప్రభుత్వ ఆదేశాలను పకడ్బందీగా అమలు చేసి రైతులకు మేలు జరిగేలా చూడాల్సిన అధికారులు ఇలా లంచాలకు మరగడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు డివిజన్ వ్యవసాయ శాఖ పైన ఇప్పటికైనా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మునుగోడు డివిజన్ వ్యవసాయ అధికారుల మామూళ్ల దందాపైన, అలాగే కారు కొనాలనుకుంటున్నా అధికారి ఎవరు మరో కథనం ద్వారా క్రైమ్ మిర్రర్ మీ ముందుకు వస్తుంది.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం.. నగర శివార్లలో ఓ హోటల్‌లో 11 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం!!!??
- దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
- మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం..
- ఓ గదిలో తల్లి మృతదేహం, మరో గదిలో ఇద్దరు కూతుళ్లు.. 9 రోజులు శవంతోనే..!
- విద్యార్థులు మంచి లక్ష్యంతో ముందుకెళ్లాలి.. సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్