
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి :- యువత క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతూ అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నారు. ఒత్తిడిని జయించలేక కొందరు.. వ్యక్తిగత కారణాలతో ఇంకొందరు బలవన్మరణాలకు పాల్పడి తీరని వేదన మిగుల్చుతున్నారని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ప్రతి సమస్యను పరిష్కారం ఉంటుందని, పెద్ద సమస్య ఏదైనా వచ్చిన వెంటనే తోటి మిత్రులు, కుటుంబీకులతో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. చిన్నచిన్న సమస్యలకు కుంగిపోయి కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో బంధాలను చిదిమేస్తున్నాయి. అయిన వారిని, కన్నవారిని పుట్టెడు దుఃఖంలోకి నెట్టేస్తున్నాయి. సమస్య ఏదైనా ఓర్పుగా పరిష్కారం వైపు అడుగులు వేయాలే తప్ప భయపడి బలవన్మరణానికి పాల్పడితే నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటో గ్రహించాలి. అనుబంధాలు, ఆత్మీయతలను ఒక్కసారి గుర్తుచేసుకుని క్షణం పాటు ఆలోచిస్తే జీవితాన్ని జయించవచ్చని అన్నారు.
ఇవి కూడా చదవండి
1.పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత…వాహనం సీజ్.. నిందితుడి అరెస్ట్!..
2.రంజాన్ ఎఫెక్ట్… 24 గంటలు అన్ని షాపులు ఓపెన్!..
3.బీఎస్సీ చదివి… టీ కొట్టు పెట్టి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన యువకుడు