క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : కుంటి సాకులు చెబుతూ రైౖతు లు, వ్యవసాయ కూలీలకు కాంగ్రెస్ కుచ్చుటోపీ పెట్టిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎకరంలోపు భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌లతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24.57 లక్షల మంది ఉన్నారన్నారు.
పెట్టుబడులు అంటేనే తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి
ఇందులో ఎక్కువ శాతం దళితులు, గిరిజనులు, బీసీలు ఉన్నారని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే వారి కడుపు కొట్టడమేనా? అని హరీశ్ ప్రశ్నించారు.రాష్ట్రంలో కోటి మంది వ్యవసాయ కూలీలు ఉండగా.. పది లక్షల మందికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. 90 శాతం మంది కూలీలకు రకరకాల కారణాలతో ఆత్మీయ భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేయడం విచారకరమని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు అడుగడుగునా రైతులను దగా చేస్తోందని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రైతు విజయోత్సవాల్లో భాగంగా నవంబరు 30న సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ కోసం రూ.2,750 కోట్ల చెక్కును విడుదల చేశారని.. ఆ చెక్కుకే దిక్కులేదని ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల్లో డమ్మీ హామీలు ఇచ్చినట్లుగా రుణమాఫీకి కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా? ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు ఎందుకు జమ కాలేదు?’ అని హరీశ్ ప్రశ్నించారు. కాగా, బీఆర్‌ఎస్ హయాంలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని హరీశ్ చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఉప్పర్‌పల్లి తాండాలో మోతీమాతను సోమవారం ఆయన దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
సంక్షేమ పథకాలకు అర్హులను మాత్రమే ఎంపిక చేయాలి: బట్టి విక్రమార్క