
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ప్రభుత్వ భూములు అమ్మడానికి కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆరోపించారు. భూములు అనే ప్రసక్తే లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… ఇప్పుడు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఇంచు భూమిని కూడా ఆమె ప్రసక్తే లేదని అసెంబ్లీ సాక్షిగా వాగ్దానాలు చేసి ఇప్పుడు మళ్ళీ వేల కోట్ల విలువైన భూములను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు.
హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పెరిటా వేలంపాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియామగానికి గత నెల 28న టెండర్లు పిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి పరాకాష్ట అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేది దేశానికి రోల్డ్ మోడల్ అయిందని టెండర్ నోట్ లో ప్రస్తావించారని తెలిపారు. టిఆర్ఎస్ పాలనలో అద్భుతమైన ప్రగతిని సాధించిన తెలంగాణను కాంగ్రెస్ కేవలం 14 నెలల పాలనలోని మొత్తం తారుమారు చేసిందని.. తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టించాలని హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో అప్పటినుండి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు.
1.వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు?
2.11 రోజులైనా దొరకని కార్మికులు.. టన్నెల్ లోనే రెస్క్యూ టీమ్స్