Wednesday, March 18, 2026
Homeజాతీయంపెళ్లి కొడుకు చేయి వణికిందని మ్యారేజ్ క్యాన్సిల్, ఇదేందిరా అయ్యా!

పెళ్లి కొడుకు చేయి వణికిందని మ్యారేజ్ క్యాన్సిల్, ఇదేందిరా అయ్యా!

High Drama At Wedding: పీటల మీద పెళ్లిళ్లు ఆగిన ఘటనలు చాలా చూస్తున్నాం. అయితే, తాజాగా బీహార్ లో ఆగిపోయిన పెళ్లి గురించి తెలిస్తే షాకవుతారు. మరీ ఇంత చిన్న విషయానికి పెళ్లి రద్దు చేసుకుంటారా? అని ఆశ్చర్యపోతారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? పెళ్లి ఎందుకు ఆగిపోయిందంటే..

పెళ్లి కొడుకు చేయి వణికిందని..

పెళ్లి జరిగే సమయంలో కొంత మంది పెళ్లి కొడుకులలో కొంత భయం అనేది ఉంటుంది. తాళి కట్టే సమయంలో చేతులు వణికిన ఘటనలు కూడా చూశాం. తాజాగా పెళ్లి కొడుకు చేతులు వణకడం పెళ్లి కూతురుకు నచ్చలేదు. ఏకంగా పెళ్లే వద్దని తెగేసి చెప్పింది. ఈ ఘటన బీహార్ లోని కైమూర్ లో సంచలనం కలిగించింది.  వధూవరులు ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చున్నారు. పెళ్లి మండపంలో బంధువులు అందరూ కూర్చున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. పెళ్లి కొడుకు చేతికి సిందూరం అందించి, వధువు నుదుటిన పెట్టాలని పురోహితుడు చెప్పాడు. అక్కడే అసలు కథ మొదలయ్యింది. ఆమె నుదుట సిందూరం పెట్టే సమయంలో అబ్బాయి చేతి వణికింది. వెంటనే అతడిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. అతడో పిచ్చివాడు, నేను చేసుకోను అని భీష్మించుకు కూర్చుంది. దీంతో పెళ్లి ఆగిపోయింది.

తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్

పెళ్లికి ముందు పెళ్లి కూతురు వాళ్లు పెళ్లి కొడుకు వరపూజ కింద రూ. లక్ష ఇచ్చారు. పెళ్లి ఆగిపోయిన నేపథ్యంలో తమ డబ్బులు తమకు ఇవ్వాలని పెళ్లి కూతురు బంధువులు డిమాండ్ చేశారు. పెళ్లి ఖర్చులకే ఆ డబ్బులు అయిపోయాయని చేతులు ఎత్తేశారు. తమ దగ్గర లేవు. ఇవ్వలేం అన్నారు. వెంటనే పెళ్లి కూతురు బంధువులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ కూడా పెళ్లి కొడుకు ఫ్యామిలీ తమ దగ్గర డబ్బులు లేవని తేల్చి చెప్పారు. చేసేదేం లేక ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. ఈ ఘటన బీహార్ లో హాట్ టాపిక్ గా మారింది.

Read Also: ఇష్టం లేని పెళ్లి, హనీమూన్ కు తీసుకెళ్లి భర్తను హత్య చేయించిన భార్య!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments