రాజకీయంవైరల్

బ్రేకింగ్ న్యూస్!.. స్కూటీ పై వచ్చి ఎంపీ గోల్డ్ చైన్ ను దొంగలించిన దుండగులు!

– స్కూటీపై వచ్చి ఎంపీ చైన్ కొట్టేసిన దుండగులు
– మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ దుర్ఘటన
– దొంగలను పట్టుకోవాలని కేంద్ర హోం మంత్రికి లేఖ

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ కి చేదు అనుభవం ఎదురయింది. ఎందుకంటే ఆమె ఎంతో ఇష్టంతో మెడలో ధరించిన గోల్డ్ చైన్ ను గుర్తు తెలియని వ్యక్తులు దోచేశారు. ఇక అసలు విషయానికి వస్తే.. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ మెడలోని చైనును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. ఢిల్లీలో ఎంపీ సుధా రామకృష్ణన్ మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలాండ్ ఎంబసీ సమీపంలో ఇద్దరూ చైన్ స్నాచర్లు ఎంపీ మెడలోని గోల్డ్ చైన్ ను కొట్టేసి పారిపోయారు. దీంతో షాకు కు గురైన ఎంపీ సుధా రామకృష్ణన్ వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఎవరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖాలను కవర్లతో కప్పుకొని స్కూటీపై వచ్చి నా మెడలోని బంగారపు చైన్ ను దొంగలించారని రాసుకొచ్చారు. వెంటనే ఆ నిందితులను పట్టుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె నేరుగా హోంమంత్రి అమిత్ షాకు లేఖ రూపంలో కోరారు. ఇదిలా ఉండగా మరోవైపు సోషల్ మీడియా వేదికగా చాలామంది ఒక ఎంపీ చైన్ ను అంత సులభంగా ఎలా దోచేస్తారు అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఎంపీ కి ఉండేటువంటి బాడీగార్డ్స్ ఆ సమయంలో ఎక్కడికి పోయారని?..ప్రశ్నలు వేస్తున్నారు.

Read also : వసూళ్లలో దూసుకుపోతున్న ‘మహావుతార్ నరసింహ’

Read also : చెరువు భూమి కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చేయాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button