
సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు
బాంబు స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు దుండగులు బాంబు బెదిరింపు కాల్ చేశారు. దీంతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టును మూసివేశారు. కోర్టు ప్రాంగణంలో ఉన్న లాయర్లను, ప్రజలందరినీ బయటకు పంపి తనిఖీలు నిర్వహించారు. డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.