
క్రైమ్ మిర్రర్, బాలీవుడ్ న్యూస్ :- బాలీవుడ్ క్యూట్ కపుల్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే జంట అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్యరాయ్. వీరిద్దరూ బాలీవుడ్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి జంట. వీరిద్దరూ ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలిచారు. అయితే చాలా రోజులుగా సోషల్ మీడియాలో అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్నారు అన్నట్లుగా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక దీనిపై తాజాగా అభిషేక్ బచ్చన్ పరోక్షంగా స్పందించడం జరిగింది.
సోషల్ మీడియాలో జరిగేటువంటి… వచ్చేటువంటి రూమర్లను అభిషేక్ బచ్చన్ తిప్పికొట్టాడు. సోషల్ మీడియాలో ఎన్నో వస్తూ ఉంటాయి… వచ్చిన ప్రతి రూమర్లకు స్పందించడం నాకు తెలీదు. మా ఫ్యామిలీ సోషల్ మీడియాలో వచ్చే రూమర్లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వదు అని అన్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎన్ని జరిగినా నాపై ఎలాంటి ప్రభావం చూపించలేవు అని తెలిపారు. ఇక మా ఫ్యామిలీ మొత్తం… నా భార్య, మా తల్లి, మా నాన్న వీళ్ళందరూ కూడా బయట జరిగేటువంటివి లేదా సోషల్ మీడియాలో జరిగేటువంటివి ఎప్పుడు కూడా నాకు చెప్పరు అని అన్నారు. బయట జరిగే ఎన్నో అబద్ధపు ప్రచారాలను మా ఫ్యామిలీ ఇంట్లోకి తీసుకురాదని స్పష్టం చేశారు.
ఎటువంటి సమస్యలు మరియు ఎటువంటి విడాకుల గోలలు లేకుండానే ప్రస్తుతం మా కుటుంబం అంతా కలిసి హ్యాపీగా ఉన్నాము… ఉంటాము కూడా అని.. అభిషేక్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇకనైనా సోషల్ మీడియాలో అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్యరాయ్ మధ్య జరిగే విడాకుల ప్రచారాలను ఆపేయాలని ఈ జంట ఫ్యాన్స్ అందరు కోరుకుంటున్నారు.
తెలంగాణలో మరో 2-3 గంటల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త!
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దరఖాస్తులకు ఆహ్వానం – డిఇఓ రమేష్ కుమార్