
దావూద్ ఇబ్రహీం నిర్వహించిన డ్రగ్ పార్టీలలో బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారనే వార్త బయటకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం రేపుతోంది. ఈ కేసుపై ముంబై పోలీసులు కొనసాగిస్తున్న విచారణలో ఇప్పటివరకు తెలియని అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్‌లోనే కాకుండా దుబాయ్ సహా ఇతర దేశాల్లో కూడా ఈ పార్టీలు నిర్వహించబడినట్లు తెలుస్తోంది.
ఈ పార్టీలకు నోరా ఫతేహి, శ్రద్ధా కపూర్, ఆమె సోదరుడు సిద్ధార్థ్ కపూర్ హాజరైనట్లు సమాచారం బయటకు రావడంతో బాలీవుడ్ లోపల చర్చలు మరింత వేగంగా మారాయి. గతంలో ఒక చిత్రంలో శ్రద్ధా కపూర్ దావూద్ సోదరి పాత్ర పోషించగా, దావూద్ పాత్రను ఆమె సోదరుడు సిద్ధార్థ్ పోషించిన విషయం మరోసారి ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ఆరోపణలనుబట్టి శ్రద్ధా కపూర్, నోరా ఫతేహికి త్వరలోనే ముంబై పోలీసులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసి ఆసక్తి పెరిగింది. మొత్తం ఈ వ్యవహారం సినిమా వర్గాలు, ప్రజలు, సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారి తీవ్ర చర్చకు దారితీసింది.
ALSO READ: మరికాసేపట్లో గ్లోబ్‌ట్రాటర్.. రాజమౌళి సాలిడ్ అప్‌డేట్ ఇదే..





