
క్రైమ్ మిర్రర్, న్యూస్:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన భారతదేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది గుడ్డివాళ్లు, చెవిటి వాళ్లు అలాగే అంగవైకల్యం కలవారు చాలామంది ఉన్నారు. అయితే ఇందులో చాలా మందికి తల్లిదండ్రులు లేక ఇలా రోడ్లమీద బిక్షం ఎత్తుకుంటూ ఉన్నారు. మరి కొంతమందికి పుట్టుకతోనే ఇలాంటివి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి వస్తుంటాయి. అయితే కొంతమంది అందత్వం కలవారు చాలామంది కూడా వాళ్ల యొక్క టాలెంట్ ను బహిరంగంగా నిరూపిస్తూ సత్తా చాటుతుంటారు. ఇలాంటి అందత్వం కలవారిని చాలామందిని నిత్యం ప్రతిరోజు కూడా ఏదో ఒక పెద్ద నగరాల్లో చూస్తూనే ఉంటాం. నిజానికి శరీరానికి అంగవైకల్యం తప్ప… మెదడుకు లేదా మనసుకు మాత్రం అంగవైకల్యం అడ్డురాదని నిరూపిస్తున్నారు. వాళ్లే రోడ్ సైడ్ పాడేటువంటి అద్భుతమైన గాయకులు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద నగరాలలో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. ఏదైనా పెద్ద నగరంలోని సెంటర్లో.. అద్భుతమైన గానంతో వీళ్ళ యొక్క టాలెంట్ను నిరూపించుకుంటూ ఉంటారు. నిజమైన సింగర్స్ కన్నా వీరు లైవ్లో అద్భుతంగా పాడుతూ ఉంటారు. పక్కన ఏదైనా పాటను వింటే చాలు టక్కున పట్టుకొని అదే పాటను అద్భుతంగా మన ముందు ప్రత్యక్షంగా పాడగలిగే సత్తా వీళ్ళకి ఉంటుంది. నిజానికి జీవనోపాధికి మాత్రమే ఇలా చేస్తున్నారు కానీ వారు డిగ్రీలను పూర్తి చేసుకుని కూడా ఉన్నారు. కానీ వీళ్ళకి జాబులు ఇవ్వడానికి కూడా అంగవైకల్యం అడ్డు రావడంతో జీవనోపాధి కోసం ఇలా చాలామంది రెండవ మార్గాన్ని ఎంచుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. వీళ్ళు ఏ పాటనైనా కూడా అలా వింటే చాలు ఇలా పడేస్తుంటారు. ఆనాటికాలపు సాంగ్స్ పాడాలి అంటే ఈనాటి తరంలో ఎవరికి కూడా అంత సులభం కాదు. కానీ రోడ్ సైడ్ పాడేటువంటి ఈ అంధత్వం గలవారు మాత్రం సునాయసంగా అదే వాయిస్తూ చాలా అద్భుతంగా పాడుతుంటారు. కానీ ఇలాంటి వారిని మాత్రం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరిగా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇలాంటి వారిని చేరదీసేలా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చాలామంది ప్రజలు తెలియజేస్తున్నారు.