Wednesday, March 18, 2026
Homeఆంధ్ర ప్రదేశ్నాగబాబు మంత్రి పదవికి బీజేపీ ఎసరు - పవన్‌ స్టాండ్‌ ఏంటంటే..!

నాగబాబు మంత్రి పదవికి బీజేపీ ఎసరు – పవన్‌ స్టాండ్‌ ఏంటంటే..!

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో:- మెగా బ్రదర్‌ నాగబాబు… మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ… ఆ పదవి ఆయన్ను ఊరిస్తుందే కానీ.. అందడంలేదు. ఎప్పుడూ ఏవో అడ్డంకులు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా బీజేపీ రూపంలో… నాగబాబు మంత్రి పదవికి చెక్‌ పడేలా ఉంది. మరి పవన్‌ కళ్యాణ్‌ ఊరుకుంటారా…? ఆయన ఎవరి వైపు మొగ్గుచూపుతారు..? బీజేపీ వైపా..? బ్రదర్‌ నాగబాబు వైపా…?

ఏపీ కేబినెట్‌లో ప్రస్తుతం ఒకేఒక్క మంత్రి పదవి మాత్రమే ఖాళీగా ఉంది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. అందులో భాగంగానే… నాగబాబును ఎమ్మెల్యే చేశారు. అయితే.. నెలలు గడుస్తున్నా నాగబాబుకు మాత్రం కేబినెట్‌ బెర్త్‌ ఖరారు కావడంలేదు. సీఎం చంద్రబాబు ఏ నిర్ణయమూ తీసుకోవడంలేదు. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని మొదట్లో పట్టుబట్టిన పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు లైట్‌ తీసుకున్నారని సమాచారం. అందుకు కారణం బీజేపీ అని అంటున్నారు కూటమి నేతలు.

ఏపీ కేబినెట్‌లో మరో మంత్రి పదవి కావాలని బీజేపీ కోరుకుంటోంది. ఆ దిశగా ఢిల్లీ నుంచి ప్రతిపాదన కూడా పెట్టినట్టు సమాచారం. ఉన్న ఒక్క పదవి బీజేపీకి ఇచ్చేస్తే.. నాగబాబు పరిస్థితి ఏంటి…? పోనీ కేబినెట్‌ విస్తరణ చేద్దామంటే… ప్రభుత్వం ఏర్పడి ఏడాదే అయ్యింది. ఈ సమంలో మంత్రివర్గ విస్తరణ చేయడం సరికాదని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు.. కేంద్రంలో కూడా కేబినెట్‌ విస్తరణకు ప్లాన్‌ చేస్తున్నారు. జనసేన నుంచి ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం కల్పించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం జనసేనలో ఇద్దరే ఎంపీలు ఉన్నారు. దీంతో.. కేంద్ర కేబినెట్‌ జనసేన చేరుతుందా లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

ఈ పరిస్థితుల్లో నాగబాబుకు ఏపీ కేబినెట్‌లో చోటు కల్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే… కుటుంబంలో వారికి ఇచ్చినట్టు అవుతుందని… అలాకాక… కేంద్ర కేబినెట్‌లో జనసేనకు చోటిచ్చి.. ఏపీలో కూడా జనసేన నుంచి ఒక బీసీ నేతకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న ప్రతిపాదన తెరపైకి వచ్చిందని సమాచారం. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొదట నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టిన పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇప్పుడు లైట్‌ తీసుకున్నారట. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే విషయం సీఎం చంద్రబాబుకే వదిలేసినట్టు సమాచారం. దీంతో.. నాగబాబుకు మంత్రి పదవి వస్తుందో లేదో డౌటే అన్న చర్చ మొదలైంది.

అన్నకు వకాల్తా పుచ్చుకున్న కవిత – రూటు మారిందా..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments