Z category Security To Nitin Nabin: బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ప్రధాని మోడీ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఐదుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన 45 ఏళ్ల నితిన్ నబీన్.. ఆ పదవిని స్వీకరించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు.
నితిన్ నబీన్ కు జడ్ కేటగిరీ భద్రత
అనంతరం ఆయన సెక్యూరిటీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నబీన్ కు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఆయనకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కమాండోలు రక్షణ కవచంగా ఉంటారు. వాస్తవానికి నితిన్ నబీన్‌కు భద్రత కల్పించాలని కొద్దివారాల క్రితం కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఆ ప్రకారం ఆయన దేశ వ్యాప్తంగా పర్యటించేటప్పుడు, బహిరంగ సభల్లో పాల్గొనేటప్పుడు, ఆయన నివాసం వద్ద సీఆర్‌పీఎఫ్ సిబ్బంది 24 గంటలూ పహారాగా ఉంటారు.
గతంలో జేపీ నడ్డకూ జెడ్ కేటగిరీ భద్రత
నితిన్ నబీన్ కు ముందు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాకూ జడ్ కేటగిరీ భద్రతనే కేంద్రం కేటాయించింది. సీఆర్‌పీఎఫ్ వీఐపీ సెక్యూరిటీ వింగ్ ఆయన భద్రతా ఏర్పాట్లు చూసుకునేది. వీఐపీ సెక్యూరిటీ కవర్ కింద కేంద్రం రక్షణ కల్పించే కేటగిరిల్లో అత్యున్నత కేటగిరి జడ్ ప్లస్ కాగా.. తర్వాత కేటగిరిల్లో జడ్ ప్లస్, జడ్, వై, వై ప్లస్, ఎక్స్ కేటగిరీలు ఉన్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గాంధీ ఫ్యామిలీ సభ్యులతో సహా 200 మంది వీఐపీలకు సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పిస్తోంది.





