ఢిల్లీలో అందరి దృష్టి వచ్చే నెల 5వ తారీఖున జరిగే ఎన్నికలపై మళ్లీంది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీల రాజకీయ నేతలు ఢిల్లీలో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల వైపు దృష్టి మళ్లించారు. దీనికి కారణం వరుసగా మూడుసార్లు గెలిచి అధికారంలో ఉన్న కేజ్రీవాల్ పార్టీ ఆప్ ను, సేమ్ అలానే కేంద్రంలో మూడోసారి గెలిచిన భారతీయ జనతా పార్టీ ఆపగలదా లేదా అన్న చర్చ అందరిలోనూ మొదలైంది. ఇక ఈసారి జరగబోయేటువంటి ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు అనేవి తలకిందుల అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు బిజెపి మరోవైపు ఆప్ పార్టీల కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేసే పార్టీలు రెండు. అవి బిజెపి మరియు ఆప్ పార్టీల మధ్య మాత్రమే తీవ్రంగా పోటీ అనేది ఉంటుంది. ఇక మూడో పార్టీ అయినటువంటి కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవడానికి ఎలక్షన్లలో ఒక అడుగు ముందుకు వేసింది. దీంతో ప్రధాన పోటీ దారులు అయినటువంటి కేజ్రీవాల్ మరియు మోడీ పార్టీలు గెలుపు కోసం సర్వశక్తుల పోరాడుతాయి. తాజాగా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి మరియు ఇతర అంశాల కంటే ఉచిత పథకాల హామీలను ఇరు పార్టీలు ఎక్కువగా ఢిల్లీలోని పలు ప్రాంతాలలో ఉచిత హామీలను ప్రకటిస్తున్నారు. వరుసగా మూడుసార్లు గెలిచినటువంటి ఆప్ పార్టీ నే ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు అయితే చెబుతున్నాయి. కాకపోతే ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి మేము వస్తాము, ప్రజల సపోర్ట్ ఎక్కువగా మాకు ఉంది అంటూ బిజెపి పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నాయి. కాగా తాజాగా కేజ్రివాల్ అరెస్టయి జైలుకు వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇక ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాగా ఫిబ్రవరి 5వ తారీఖున ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక మూడు రోజుల తర్వాత అనగా ఫిబ్రవరి 8వ తారీఖున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ఆరోజు ఏ పార్టీ ఎంత మెజారిటీతో గెలుస్తుందా అనేది దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీ నేతలతో పాటు ఆయా పార్టీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
1.ఎమ్మెల్యే పై కోడిగుడ్లు విసిరిన కార్యకర్తలు!.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ?