క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ తాజాగా తెలంగాణలోని నాంపల్లి బిజెపి ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బిజెపి పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. బిజెపి ఆఫీస్ పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒక క్షణం మేము కనుక తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీసును తగలబెడతామని హెచ్చరించారు.
Read More : ఏపీ ప్రజలకు శుభవార్త!… తగ్గనున్న విద్యుత్ చార్జీలు?
ఈ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దారుణమని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా?.. అంటూ నిలదీశారు. మీరు నిజంగా కార్యకర్తలు అయితే నిలదీసే పద్ధతి, నిరసన తెలిపే పద్ధతి ఇదేనా అంటూ కాంగ్రెస్ కార్యకర్తలపై మండిపడ్డారు.
Read More : భారీగా పెరుగుతున్న చైనా వైరస్ కేసులు.. గాంధీ హాస్పిటల్ రెడీ
కాగా ఇవాళ కాంగ్రెస్ నాయకులు బిజెపి కార్యాలయం పై దాడులు చేయడంతో ఇరు పార్టీల మధ్య గొడవలు ప్రారంభమై ఘర్షణకు పాల్పడ్డారు. ఇందులో పలువురు కార్యకర్తలు గాయపడగ వారిని ఆసుపత్రులకు తరలించారు. కాగా ఈ గొడవలన్నీ బీజేపీ నేత రమేష్ వలన వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఢిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గలు లా నున్నగా మారుస్తామని అనడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.
ఇవి కూడా చదవండి
1. శబరిమలలో తెలుగు స్వాములపై వివక్ష!
2. తొలిసారి శ్రీ తేజను పరామర్శించిన అల్లు అర్జున్!..
3.భారత్ లో 6 చైనా వైరస్ కేసులు.. టెన్షన్ వద్దన్న కేంద్రం
4.రేవంత్ కు వ్యతిరేకంగా ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం దగ్గర పోస్టర్లు