![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-2025-02-08T111444.279.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఢిల్లీలో విలువడుతున్న ఎన్నికల ఫలితాలు అనేవి బిజెపి గెలుపు ఖాయమన్నట్లు కనిపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఉత్కంఠంగా సాగుతున్న ఎన్నికల ఫలితాలు అనేవి ఆయా పార్టీలో కార్యకర్తలు లేదా అభిమానులు అందరూ కూడా చాలా ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. అయితే ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఢిల్లీలో కూడా తెలుగు ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుసుకొని ముందుగానే బిజెపి అధిష్టానం చంద్రబాబును రప్పించి మరి ఎన్నికల సమయంలో ప్రచారం చేయించింది.
రక్షకులే యమ బక్షకులై…. బాధితురాలిని చంపెయ్యమంటూ ఓ పోలీస్ అధికారి సూచన..?
అయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని బిజెపి అభ్యర్థుల తరఫున షాధార, విశ్వాస నగర్, సంఘం విహార్ నియోజకవర్గాల్లో పలుచోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఇవాళ వెలువడుతున్న ఎన్నికల ఫలితాలలో ఈ మూడు నియోజకవర్గాల నుంచి బిజెపి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా చాలా ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బిజెపి చంద్రబాబును ప్రచారం చేయించింది. తీరా చూస్తే ఇక్కడ చంద్రబాబు ప్రచారం జోరుగా ప్రజల్లోకి వెళ్లి బిజెపి అభ్యర్థులు ముందంజలో ఉండడానికి కారణమైంది. చివరిగా బిజెపి పార్టీ అనుకున్నట్లుగా చంద్రబాబు ప్రచారం వర్క్ అవుట్ అయినట్లుగా తెలుస్తుంది.
ఢిల్లీలో ఉత్కంఠత!… కేజ్రీవాల్ వెనుకంజ !… కొద్దిసేపట్లో తేలిపోనున్న గెలుపోటములు ?
హీరోల క్రికెట్ నేడే ప్రారంభం!… సాయంత్రం 6 గంటలకు టాలీవుడ్ మ్యాచ్?